
ప్రస్తుతం ప్రభాస్‌పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ఇంట్రవెల్‌లో వస్తాయట. ఈ షెడ్యూల్ ఈ నెల చివరి వరకు జరుగుతుందని తెలిసింది.
‘సలార్’ కోసం యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు హీరో ప్రభాస్. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘సలార్’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఆరంభం అయింది. ప్రస్తుతం ప్రభాస్‌పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ఇంటర్వెల్‌లో వస్తాయట. ఈ షెడ్యూల్ ఈ నెల చివరి వరకు జరుగుతుందని తెలిసింది.
జగపతిబాబు, మలయాళ నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాతో పాటు ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కూడా చేస్తున్నారు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. మరోవైపు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న ‘స్పిరిట్’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది.
చదవండి: సల్మాన్‌కు కొత్త సబ్బు కనిపిస్తే చాలు బ్యాగులో వేసుకుంటాడట!
హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా?