Prabhas Die Hard Fan Ranjith Mother Emotional Comments On His Son And Prabhas, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas: అభిమాని ఆఖరి కోరిక తీర్చిన ప్రభాస్‌, ఇంటికి పిలిచి స్వయంగా తినిపించి.. బాహుబలి..

May 29 2023 12:44 PM | Updated on May 29 2023 1:19 PM

Prabhas Die Hard Fan Ranjith Mother Interview - Sakshi

రాజమౌళికి ఫోన్‌ చేసి ప్రభాస్‌ శ్రీనుతో బాహుబలిలో వాడిన కత్తిని తెప్పించి, దానిపై సంతకం చేసి బహుమతిగా ఇచ్చాడు. నా కొడుకు చనిపోయేవరకు దీన్ని పక్కనే

డార్లింగ్‌ హీరో ప్రభాస్‌ రేంజ్‌ బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా లెవల్‌కు వెళ్లిపోయింది. సౌత్‌ నుంచి నార్త్‌ దాకా ఆయనకు అభిమానులున్నారు. ఇటీవల వచ్చిన ప్రభాస్‌ సినిమాలు కాస్త నిరాశపర్చినా ఆయనపై అభిమానం కూసింత కూడా తగ్గలేదు. అడిగినవారందరికీ సాయం చేసే ప్రభాస్‌.. ఫ్యాన్స్‌కు ఎప్పుడూ పెద్ద పీట వేస్తాడు. గతంలో ఆయన వీరాభిమాని రంజిత్‌ చివరి కోరిక తీర్చాడు ప్రభాస్‌. క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో ప్రభాస్‌ను కలవాలని తన ఆఖరి కోరిక చెప్పడంతో డార్లింగ్‌ అతడికి కలవడమే కాకుండా తనకు నచ్చిన ఫుడ్‌ పెట్టి బట్టలు కొనిచ్చాడు. బాహుబలి సినిమాలోని ఓ కత్తిని కూడా అతడికి బహుకరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

అడిగిన రోజే అపాయింట్‌మెంట్‌
25 ఏళ్ల వయసులో మరణించిన రంజిత్‌కు అనకాపల్లిలోని ఇంటి ముందు గుడి కూడా కట్టించారు అతడి తల్లిదండ్రులు. తన కొడుకు గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నీటిపర్యంతం అయింది రంజిత్‌ తల్లి. 'మా బాబు చనిపోయే ముందు ఒకే ఒక కోరిక కోరాడు. ఒక్కసారి ప్రభాస్‌ దగ్గరకు తీసుకెళ్లమ్మా అని అడిగాడు. అప్పుడు నేను పూరీ జగన్నాథ్‌ భార్య లావణ్య వదినకు ఫోన్‌ చేసి విషయం చెప్పాను. ఆమె వెంటనే ప్రభాస్‌కు సమాచారం చేరవేయడం.. అదే రోజు రాత్రి ప్రభాస్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, రెండు గంటలపాటు మాకు సమయాన్ని కేటాయించడం చాలా ఆనందాన్నిచ్చింది.

అభిమానికి స్వయంగా తినిపించి..
పూరీ అన్నయ్య ఇంటికి వెళ్తే ఆయన అబ్బాయి అకాష్‌ పూరి నా కొడుకును షాపింగ్‌కు తీసుకెళ్లి నాలుగు జతల బట్టలు కొనిచ్చాడు. అక్కడి నుంచి ప్రభాస్‌ ఇంటికి వెళ్లాం. వెళ్లగానే బాబుకు ఇష్టమైన చికెన్‌ మంచూరియా తెప్పించాడు. అయినా బాబు దాన్ని ముట్టుకోలేదు. ఏమైందిరా, తిను అని ప్రభాస్‌ అంటే తినిపించమని అడిగాడు. దాంతో ప్రభాస్‌ స్వయంగా తినిపించాడు. మరి నాకు పెట్టవా? అని అడిగి మరీ నా కొడుకుతో గోరుముద్దలు తిన్నాడు. ఆ తర్వాత ప్రభాస్‌ నా కొడుక్కి బట్టలు పెట్టాడు. వీడు కూడా ఆయనకు బట్టలు ఇచ్చాడు.

సలార్‌ షూటింగ్‌కు పిలిచాడు
సలార్‌ షూటింగ్‌కు నువ్వు రావాలిరా.. అప్పుడు నీతో టైం స్పెండ్‌ చేస్తా అన్నాడు. నా కొడుకు బాహుబలిలో ఒక వస్తువు కావాలని అడిగాడు. అప్పటికప్పుడు ఆయన రాజమౌళికి ఫోన్‌ చేసి ప్రభాస్‌ శ్రీనుతో బాహుబలిలో వాడిన కత్తిని తెప్పించి, దానిపై సంతకం చేసి బహుమతిగా ఇచ్చాడు. నా కొడుకు చనిపోయేవరకు దీన్ని పక్కనే పెట్టకుని నిద్రించేవాడు. ప్రభాస్‌కు ఎప్పటికైనా ఓ గుడి కట్టాలని రంజిత్‌ బలంగా అనుకునేవాడు. ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు' అని చెప్తూ ఎమోషనలైంది రంజిత్‌ తల్లి.

చదవండి: తమన్నా నా చెంప పగలగొడుతుందేమో: బాలీవుడ్‌ నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement