‘పగ పగ పగ’.. ఫస్ట్‌డే ఫస్ట్‌ షో ఫ్రీ | Sakshi
Sakshi News home page

‘పగ పగ పగ’ ఫస్ట్‌డే ఫస్ట్‌ షో ఉచితంగా చూడొచ్చు

Published Sun, Sep 18 2022 3:27 PM

paga paga paga First Day First Show Free,  Movie Team Announced - Sakshi

ఏ సినిమాకైనా మొదటి రోజు మొదటి ఆట ఎంతో ముఖ్యం. మౌత్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాలెన్నో ఉన్నాయి. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోను ఉచితంగా వేస్తున్నారంటే.. సినిమా మీద ఎంత నమ్మకం ఉండాలి. ఇప్పుడు పగ పగ పగ సినిమా యూనిట్ కూడా అదే నమ్మకంతో ఉన్నట్టుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం పగ పగ పగ. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా పగ పగ పగ చిత్రం రాబోతోంది. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు. నిర్మాత సత్య నారాయణ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ ఫ్రీగా చూపించాలని నిర్ణయించుకున్నారు మేకర్స్‌. సినిమా మీదున్న నమ్మకంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు. బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కోటి అందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement