అల్ట్రా మోడ్రన్‌ లుక్‌లో మెగా డాటర్‌.. మనోజ్‌ సినిమాలో.. | Sakshi
Sakshi News home page

Niharika Konidela: వాట్‌ ద ఫిష్‌ మూవీలో నిహారిక.. సర్‌ప్రైజ్‌ అదిరిపోలా!

Published Mon, Dec 18 2023 7:26 PM

Niharika Konidela Joins in Manchu Manoj What the Fish Movie - Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు సుపరిచితురాలే! అప్పట్లో ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఒరు నల్ల నాల్‌ పాట సొల్రెన్‌ అనే తమిళ చిత్రంలోనూ యాక్ట్‌ చేసింది. సైరాలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. ఈమెకు సొంతంగా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ అనే బ్యానర్‌ కూడా ఉంది.

పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు గుడ్‌బై చెప్పి ఫుల్‌టైమ్‌ నిర్మాతగా మారిపోయింది. 2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడిన నిహారిక ఈ ఏడాది ప్రారంభంలో అతడికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత తిరిగి తన కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. డెడ్‌ పిక్సెల్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. తాజాగా మరో సినిమాలోనూ యాక్ట్‌ చేసేందుకు రెడీ అయింది. మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న వాట్‌ ద ఫిష్‌ మూవీలో నిహారిక భాగం కానుందట.

ఈరోజు మెగా డాటర్‌ బర్త్‌డేను పురస్కరించుకుని ఫస్ట్‌ లుక్‌ వీడియో రిలీజ్‌ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇందులో నిహారిక అల్ట్రామోడన్‌ లుక్‌లో అదిరిపోయింది. అయితే ఈ సినిమాలో నిహారిక కీలక పాత్రలో నటిస్తుందా? లేదా హీరోయిన్‌గా చేయనుందా? అన్నది తెలియాల్సి ఉంది. వరుణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 6ఐఎక్స్‌ సినిమాస్‌పై విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: సోఫాజీ టాప్‌ 3కి వచ్చాడంటే వాళ్లే కారణం.. లేదంటే జీరోగా మిగిలేవాడు!

Advertisement
 
Advertisement