విక్కీ కౌషల్‌, కత్రీనా కైఫ్‌ ప్రేమ మందిరం.. పెళ్లి తర్వాత మకాం అక్కడేనా?

New Apartment For Vicky Kaushal And Katrina Kaif After Marriage - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కత్రీనా కైఫ్‌, విక్కీ కౌషల్‌ ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వారు ప్రేమలో మునిగితేలుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఐదు రోజుల క్రితం కత్రీనా కైఫ్‌కు సన్నిహితుడైన ఏక్‌ థా టైగర్‌ డైరెక్టర్‌ కబీర్‌ ఖాన్‌ ఇంట్లో వీరిద్దరికి రోకా జరిగిందని అనేక వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం ఇంతవరకు రాలేదు. ఈ హీరో హీరోయిన్లు వారి రిలేషన్‌ను ఎప్పుడు కన్ఫర్మ్‌ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వీరికి సంబంధించి ఇంకో గాసిప్‌ బయటికొచ్చింది. 

విక్కీ కౌషల్‌, కత్రీనా కైఫ్‌ వారి వివాహం తర్వాత అపార్ట్‌మెంట్‌లోకి మారనున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. అందుకు ఓ అపార్ట్‌మెంట్‌ అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్డింగ్‌లో మరో పాపులర్‌ కపుల్ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ ఉంటున్నట్లు సమాచారం. జుహులోని రాజ్‌మహల్‌ అల్ట్రా లగ్జరీ భవనంలో ఓ ఫ్లాట్‌ను ఐదేళ్లకు రెంట్‌కు తీసుకున్నట్లు రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌ హెడ్‌ వరుణ్‌ సింగ్‌ చెప్పాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉం​​​టే కత్రీనా కైఫ్‌ తన ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఇంతకుముందు చాలా సార్లు వార్తల్లో నిలిచారు. ఈ అల్లరి పిడుగు హీరోయిన్‌ కెరీర్‌ ప్రారంభంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో లవ్‌ ఎఫైర్‌ నడిపారు. సుమారు ఏడేళ్ల క్రితం ఈ రిలేషన్‌ పీక్స్‌లో సాగింది. అయితే ఈ విషయాన్ని కత్రీనా కైఫ్‌ గానీ, సల్మాన్‌ ఖాన్‌ గానీ బయటపెట్టలేదు. అనంతరం బ్రేకప్‌ కూడా జరిగింది. రణ్‌బీర్‌ కపూర్‌తోనూ సీరియస్‌గా లవ్‌ ట్రాక్‌ నడిపిందని ప్రచారం సాగింది. పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారన‍్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ బంధం కూడా ఎన్నో రోజులు నిలువలేదు.  

అక్షయ్‌ కుమార్‌తో పలు సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. అప్పుడు వీరిద్దరి మధ్య అఫైర్‌ నడుస్తోందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. అలాగే లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా కుమారుడు సిద్ధార్థ్‌ మాల్యాతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. వీరిద్దరు జంటగా ఐపీఎల్‌ మ‍్యాచ్‌లు వీక్షించడం, పలు ప్రైవేట్‌ పార్టీల‍్లో కలిసి పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఈ అమ్మడి ప్రేమ వ్యవహారాలేవి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించకపోవడం విశేషం.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top