అసలు ఆమెను ఎలా తీసుకున్నారు?.. బుల్లితెర నటిపై విమర్శలు | Neru Movie Malayalam Actress Haritha G Nair Open About Her Colour Comments, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Haritha G Nair: 'కలర్ కాదు చూడాల్సింది.. క్యారెక్టర్‌'

Published Mon, Apr 15 2024 12:15 PM

Neru Movie Malayalam Actress Haritha G Nair Open About Her Colour Comments - Sakshi

గతేడాది మోహన్‌ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నేరు. మలయాళంలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ప్రియమణి లాయర్‌గా కనిపించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

అయితే ఈ చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి హరిత జి నాయర్. మోహన్‌ లాల్ వద్ద జూనియర్‌ లాయర్ పాత్రలో మెప్పించింది. మొదట ఫాహద్ ఫాజిల్ నటించిన కార్బన్‌ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత రియాల్టీ షోలు, సీరియల్స్‌తో బిజీగా మారిపోయింది. హరిత నాయర్ ప్రస్తుతం శ్యామంబరం సీరియల్‌లో నటిస్తోంది.   

ప్రస్తుతం ఆమె శ్యామాంబరం సీరియల్‌లో  నల్లగా ఉండే అమ్మాయి పాత్రలో నటించింది. అయితే ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ పాత్రలో అసలు హరితను ఎలా తీసుకున్నారంటూ నెటిజన్స్ విమర్శించారు. అయితే ఇలాంటి కామెంట్స్‌పై హరిత సైతం తనదైన శైలిలో స్పందించింది. క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ తెల్లగా ఉన్నారా? లేదా నల్లగా ఉన్నారా? అనేది ముఖ్యం కాదని హితవు పలికింది. కేవలం క్యారెక్టర్ యాక్టింగ్ ఎబిలిటీ మాత్రమే చూడాలని.. రంగును కాదని సూచించింది. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే బదులిచ్చింది బుల్లితెర భామ. కాగా.. మొదటి నర్సుగా కెరీర్ ప్రారంభించిన హరిత.. తక్కువ కాలంలోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. 

Advertisement
 
Advertisement