
'హిట్3: ది థర్డ్ కేస్' వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. కేవలం నాలుగురోజుల్లోనే ఈ రికార్డ్‌ను సాధించడంతో నాని ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ మూవీ ఆ తర్వాతి రోజుల్లో కూడా జోరు పెంచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పెద్దగా పోటీ లేకపోవడం ఆపై సినిమా పట్ల పాజిటీవ్ టాక్ రావడంతో థియేటర్స్ వద్ద అర్జున్ సర్కార్ సందడి చేస్తున్నాడు. హిట్3 వంద కోట్ల క్లబ్‌లో చేరిందని తాజాగా ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటించారు.

హిట్3 సినిమా కేవలం నాలుగురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 101 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రకటించారు. నాని కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా దసరా (రూ.120 కోట్లు) ఉంది. మరో వారంలోపే ఆ రికార్డ్‌ను సులువుగా హిట్3 చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు నాని కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో ఉన్న సరిపోదా శనివారం రూ.101 కోట్లు, ఈగ రూ. 100 కోట్లు చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు హిట్3 నాలుగో చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
హిట్3 విడుదల సమయంలో సూర్య 'రెట్రో', హిందీలో అజయ్ దేవగణ్ 'రైడ్ 2' చిత్రాలు మే 1న థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో ఏదీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, హిట్3 మూవీలో కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నాని అద్భుతమైన నటనతో దుమ్మురేపాడు. ఈ మూవీకి నిర్మాత కూడా నానినే కావడం విశేషం. త్వరలో 'ప్యారడైజ్' షూటింగ్‌లో నాని జాయిన్ అవుతాడు. ఆ తర్వాత సుజీత్‌తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది.
SARKAAR'S CENTURY 💥💥💥
101+ CRORES GROSS WORLDWIDE for #HIT3 in 4 days ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/8HrBsV0jIt
A massive first weekend for the action crime thriller 🔥#BoxOfficeKaSarkaar pic.twitter.com/QJgST28de0— Wall Poster Cinema (@walpostercinema) May 5, 2025