
నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) వరుస విజయాలతో స్పీడ్ మీదున్నారు. రీసెంట్‌గా డాకు మహారాజ్‌తో విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయిపోతున్నాడు. అయితే, మాస్ సినిమాలకు తనదైన మార్క్ చూపించే బాలయ్య ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్నాడు. వీర సింహారెడ్డి సినిమాతో తనకు హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమాను ఆయన ప్రకటంచనున్నారు. ఈమేరకు ఇద్దరి మధ్య చర్చలు కూడా ముగిశాయని తెలుస్తోంది.
జాట్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన గోపీచంద్ మలినేని మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఆయనకు హిందీలో కూడా ఆదరణ దక్కింది. క్రాక్, వీర సింహా రెడ్డి , జాట్ ఇలా వరుస చిత్రాలతో జోరు మీదున్న మలినేని మరోసారి బాలయ్యతో సినిమా సెట్ చేశాడు. వృద్ధి సంస్థ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2: తాండవం’ దసరా సందర్భంగా సెప్టెంబరు 25న థియేటర్లలోకి రానుంది. బాలయ్య ఇందులో మురళీ కృష్ణగా, అఖండ రుద్ర సికిందర్ అఘోరాగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ‘అఖండ’కు కొనసాగింపుగా పాన్ ఇండియా రేంజ్‌లో బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అఖండ సినిమాకు బాలీవుడ్‌లో భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ చిత్రాన్ని హిందీలో డైరెక్ట్‌గా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి త్వరలో గ్లింప్స్ విడుదల కానుంది.