మహేశ్‌ ఫ్యామిలీ ఇంట వినాయక నిమజ్జన వేడుకలు.. వీడియో వైరల్‌

Namrata Shirodkar Shares Immersion of Ganesh Video - Sakshi

Mahesh Babu Family Ganesh Chaturthi Celebrations: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఫ్యామిలీ ప్రతి ఏటా వినాయక చవితి పండగను ఘనంగా జరుపుకుంటుంది. ఇంట్లో గణేశ్‌ విగ్రహాన్ని ప్రతిష్టించి నిష్టగా పూజలు చేస్తారు. అయితే ఈ సారి పర్యావరణ సహిత వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నారు ఘట్టమనేని ఫ్యామిలీ. ఘనంగా పూజలు నిర్వహించడమే కాదు.. నిమజ్జనం కూడా అలాగే చేశారు.మ‌ట్టి గ‌ణేషుడిని ఇంట్లోని తొట్టిలో నిమ‌జ్జ‌నం చేయ‌గా, ఆ కార్య‌క్రమంలో మ‌హేశ్‌, న‌మ్ర‌త‌, సితార‌, గౌత‌మ్ పాల్గొన్నారు.

నిమ‌జ్జ‌నం చేసే ముందు పూజ‌లు చేసి ఆ త‌ర్వాత గ‌ణేషుడికి బైబై చెప్పారు. ‘గణేశుడికి వీడ్కోలు ఎప్పుడూ ఉండదు. ఆ దేవ దేవుడి కృప మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ త్వరగా వస్తావని ఆశిస్తున్నాను అంటూ న‌మ్ర‌త ఓ వీడియోని తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. 
(చదవండి: సైదాబాద్‌ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్‌)

వినాయక విగ్రహాల నిమజ్జనం జలవనరులు కాలుష్యానికి కారణం కాకుడదని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.  మహేశ్‌బాబు, నమ్రత సహజంగానే ప్రకృతి ప్రేమికులు. పర్యావరణాన్ని కాపాడుతూనే పండగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవచ్చని ఘట్టమనేని ఫ్యామిలీ నిరూపించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top