Nagarjuna Interesting Comments on Chiranjeevi-Jagan Meet in Bangarraju Movie Success Meet - Sakshi
Sakshi News home page

Nagarjuna Akkineni: సీఎం జగన్‌, చిరు భేటీపై మరోసారి స్పందించిన నాగార్జున

Jan 15 2022 1:31 PM | Updated on Jan 15 2022 3:59 PM

Nagarjuna Akkineni Talks In Bangarraju Movie Success Meet - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, టాలీవుడ్‌ అగ్ర హీరో మెగాస్టార్‌ చిరంజీవి భేటీపై నాగార్జున అక్కినేని స్పందించారు. రెండు రోజుల క్రితం చిరు ఏపీ సీఎం జగన్‌తో సినీ పరిశ్రమ సమస్యలపై సమావేశమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగార్రాజు మూవీ సక్సస్‌ మీట్‌లో పాల్గొన్న నాగార్జున సీఎం జగన్‌-చిరు భేటీపై మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: తొలి రోజు ‘బంగార్రాజు’ మూవీ కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే..

కాగా నిన్న(జనవరి 14) సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌వైపు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీంతో పాటు నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగార్జున సీఎం వైఎస్‌ జగన్‌, చిరంజీవి భేటీపై హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు చిరంజీవి వెళ్లారంటే తప్పకుండా హ్యాపీ ఎండింగ్‌ వస్తుందని నాగ్‌ వ్యాఖ్యానించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement