కాంబినేషన్ కుదిరింది

ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఆ తర్వాత ‘మనం’ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమా కమిట్ అయ్యారు. ఇది కాకుండా ఇంకో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాగచైతన్య నటించనున్నారని తెలిసింది. కొన్ని రోజులుగా ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ కుదిరిందన్నది తాజా సమాచారం. ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతం నాగచైతన్య చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని తెలిసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి