క్రైమ్‌... యాక్షన్‌ | Mirzapur: The Movie releases on 4 September 2026 | Sakshi
Sakshi News home page

క్రైమ్‌... యాక్షన్‌

Sep 2 2026 3:31 AM | Updated on Sep 2 2026 3:31 AM

Mirzapur: The Movie releases on 4 September 2026

రసిక, పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్, గుర్మీత్‌ సింగ్, సోనాల్, దివ్యేందు, రవి కిషన్‌

పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిర్జాపూర్‌: ది మూవీ’. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్, శ్వేతా త్రిపాఠి, శ్రియ, రవి కిషన్, జితేంద్ర కుమార్, రసిక దుగ్గల్, హర్షిత గౌర్‌ ఇతర పాత్రలు పోషించారు. రితేష్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 4న హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో పంకజ్‌ త్రిపాఠి మాట్లాడుతూ– ‘‘మిర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ‘మిర్జాపూర్‌: ది మూవీ’ పేరుతో సినిమాగా తీసుకొచ్చాం.

 ఈ సినిమా తప్పకుండా మీ అందర్నీ అలరిస్తుంది’’ అని తెలిపారు. ‘‘మిర్జాపూర్‌ సిరీస్‌ని తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో అభిమానించారు. ఈ సినిమాని కూడా థియేటర్‌లో ఎంజాయ్‌ చేయొచ్చు’’ అన్నారు దివ్యేందు శర్మ. ‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాను థియేటర్‌లో చాలా గొప్పగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. అందుకే మా చిత్రాన్ని కూడా తెలుగులోకి తీసుకురావాలనుకున్నాం’’ అని చెప్పారు గుర్మీత్‌ సింగ్‌. ‘‘తెలుగులో నేను చేసిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి. ‘మిర్జాపూర్‌: ది మూవీ’లో బబ్బన్‌ యాదవ్‌ అనే క్యారెక్టర్‌ చేశాను’’ అన్నారు రవి కిషన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement