ఒక్క ఏడాదిలోనే రూ.140 కోట్ల నష్టం: మిరాయ్‌ నిర్మాత | Mirai Movie Producer TG Vishwa Prasad about His Losses in 2024 | Sakshi
Sakshi News home page

సినిమాలు హిట్టే.. కానీ రూ.140 కోట్లు నష్టపోయా: మిరాయ్‌ నిర్మాత

Sep 18 2025 8:48 PM | Updated on Sep 18 2025 9:23 PM

Mirai Movie Producer TG Vishwa Prasad about His Losses in 2024

తేజ సజ్జ హీరోగా, మంచు మనోజ్‌ విలన్‌గా నటించిన మిరాయ్‌ మూవీ బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్లు దాటేసిన ఈ మూవీ మున్ముందు మరిన్ని రికార్డులు తిరగరాయనుంది. ఈ సినిమాతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు బిగ్‌ రిలీఫ్‌ దొరికినట్లయింది. గతేడాది కోట్లాది రూపాయలు నష్టపోయిన ఆయన మిరాయ్‌పై పెట్టుకున్న ఆశలు నిజమవుతున్నాయి. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓటీటీ వల్ల మా సినిమాల బిజినెస్‌ దెబ్బతింది.

ఒక్క ఏడాదే రూ.140 కోట్ల నష్టం
ఒక్క ఏడాదిలోనే మేము ఐదారు సినిమాలు చేశాం. అవి వడక్కుపట్టి రామస్వామి, ఈగల్‌, మనమే, విశ్వం, స్వాగ్‌, మిస్టర్‌ బచ్చన్‌.. ఇవి కొన్ని థియేటర్లో బాగా ఆడినా నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ సరిగా చేయలేకపోయాయి. ఈ సినిమాలను ఓటీటీలకు సరైన సమయంలో అమ్మకపోవడం వల్ల భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. కేవలం ఓటీటీల వల్లే 2024లోనే రూ. 120 -140 కోట్లు నష్టపోయాను. ఇంకా రికవరీ అవలేదు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్‌ మరోసారి వైరల్‌గా మారాయి.

చదవండి: సల్మాన్‌ ఒక గూండా, నీచుడు.. ఆ స్టార్‌ హీరో దర్శకుడిని కొట్టాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement