Bollywood Director Milap Zaveri Opens Up on Losing 32 Kgs in a Year - Sakshi
Sakshi News home page

Milap Zaveri : 'కొడుకుతో ఆడుకోలేకపోయా..బాగా నీరసం వచ్చేది'..

Mar 3 2022 7:50 PM | Updated on Mar 3 2022 8:52 PM

Milap Zaveri Loses 32 Kgs: I Could Not Play With My Son Earlier - Sakshi

సంకల్పం దృడమైందయితే, పర్వతాన్ని అయినా కదిలించొచ్చు అంటారు. 'సత్యమేవ జయతే' డైరెక్టర్‌ మిలాప్‌ జవేరి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఒక్క ఏడాదిలోనే 30కిలోలకు పైగా బరువు తగ్గి వావ్‌ అనిపించుకుంటున్నారు. తాజాగా  తన వెయిట్‌ లాస్‌ జర్నీని నెటిజన్లతో పంచుకున్నారు. 

'నేను అప్పుడు 130 కిలోల బరువుంటాను. భారీ శరీరం కావడంతో ఆరేళ్ల నా కొడుకు మోహన్‌తో సరిగ్గా ఆడుకోలేకపోయేవాడిని. బాగా నీరసం వచ్చేది. దీంతో చివరకు నేను ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నను. అప్పటి నుంచి ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను పెట్టుకొని క్రమం తప్పకుండా డైట్‌ ఫాలో అయ్యేవాడిని. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ మూడు పూటలా తింటాను..కానీ అందులో తక్కువ కార్బ్ హై-ప్రోటీన్ ఉండేలా చూసుకునేవాడిని.

నా డైట్‌ ప్రారంభించిన రెండు నెలల వరకు ఒక్కరోజు కూడా చీట్‌ డే పెట్టకోలేదు. ట్రైనర్‌ చెప్పినట్లు ఫాలో అయ్యేవాడిని. రిజల్ట్‌ నా బాడీలో చాలా స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత కేవలం ఆదివారం నా డైట్‌కి కాస్త బ్రేక్‌ ఇచ్చి నచ్చింది తినేవాడిని. వెకేషన్‌కు గోవా వెళ్లినప్పడు కూడా ఒక్కరోజు కూడా వర్కవుట్‌ మానలేదు. అలా ఏడాదిలోనే 30కిలోలకు పైగా తగ్గను. మరో 15-20కిలోలు తగ్గాలనుకుంటున్నాను.

ఇప్పుడు నా బరువు 100కిలోల కంటే తక్కువే. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెంబర్స్‌ చూస్తున్నాయి. కానీ ఇంకా మిగిలుంది. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్' అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ఈ జర్నీలో భార్య గౌరీ, రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా వంటి ఫ్రెండ్స్‌ తనను ఎంతో ప్రోత్సహించారని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement