ఈమె తెలుగు సినిమాలు మాత్రమే చేసిన హీరోయిన్.. గుర్తుపట్టారా? | Sakshi
Sakshi News home page

Guess The Actress: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడేమో ఇలా హాట్ హాట్‌గా!

Published Sat, Oct 14 2023 9:06 PM

Mem Vayasuku Vacham Movie Actress Niti Taylor Details - Sakshi

దేశంలో చాలామంది బ్యూటీస్.. ఎక్కడ పుట్టి పెరిగినా సరే తెలుగు సినిమాలే ఫస్ట్ ఫస్ట్ చేస్తుంటారు. హిట్ కొడితే ఇక్కడే స్టార్ హీరోయిన్‌గా సెటిలైపోతారు. లేదంటే పక్క ఇండస్ట్రీలో స్టార్స్ అయిపోతారు. అయితే ఈ బ్యూటీ మాత్రం తెలుగులో మాత్రమే హీరోయిన్‌గా చేసింది. హిట్ కొట్టినా లక్ కలిసిరాలేదు. దీంతో రూట్ పూర్తిగా మార్చేసింది. ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు నితీ టేలర్. 90స్ జనరేషన్ కిడ్స్ 2012 టైంలో 'వెళ్లిపోవే వెళ్లిపోవే' అనే ఓ బ్రేకప్ సాంగ్ తెగ విన్నారు. పోనీ అదేమన్నా స్టార్ హీరో సినిమానా అంటే కాదు. తనీష్ హీరోగా నటించిన 'మేము వయసుకు వచ్చాం' అనే చిన్న మూవీలోనిది. ఈ పాట మాత్రమే కాదు సినిమా, అందులో హీరోయిన్ కూడా అప్పట్లో పాపులర్ అయింది.

(ఇదీ చదవండి: ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే ఆ బ్యూటీ 'బిగ్ బాస్' ‍నుంచి ఎలిమినేట్!)

ఆ సినిమాలో హీరోయిన్‌గా చేసిన నితీ.. తెలుగులోనే పెళ్లి పుస్తకం, లవ్.కామ్ అని మరో రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కానీ లక్ కలిసిరాలేదు. దీంతో సినిమా హీరోయిన్ కెరీర్‌కి పుల్‌స్టాప్ పెట్టేసింది. అప్పటికే చేస్తున్న టీవీ సీరియల్స్‌లో యమ బిజీగా మారిపోయింది. 2018 నుంచి మ్యూజిక్ వీడియోలు చేస్తూ ఉత్తరాదిలో చాలా క్రేజ్ తెచ్చుకుంది.

తెలుగు చిత్రసీమలో సక్సెస్ కానప్పటికీ నార్త్‌లో మాత్రం బోలెడంత ఫేమ్ సంపాదించింది. ఇక లాక్‌డౌన్ టైంలో  ఆర్మీ ఆఫీసర్ పరీక్షిత్ బవాని పెళ్లి చేసుకుంది. అయితే తెలుగులో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చినప్పుడు బొద్దుగా చబ్బీ లుక్‌తో క్యూట్‌గా అనిపించిన నితీ టేలర్.. ఇప్పుడేమో హాట్ హాట్‌గా మతి పోగొడుతోంది. ఈమెని చూసిన తెలుగు ప్రేక్షకులు తొలుత గుర్తుపట్టేలేకపోయారు. ఆ తర్వాత ఆమె ఈమెనా అని తెలిసి షాకయ్యారు.

(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!)

Advertisement
 
Advertisement