Megastar Daughter Sreeja Konidela Gives Clarity About Her Relationship Status - Sakshi
Sakshi News home page

Sreeja Konidela: ఆ వ్యక్తి మరెవరో కాదు.. క్లారిటీ ఇచ్చిన శ్రీజ..!

Jan 4 2023 4:01 PM | Updated on Jan 4 2023 6:53 PM

Megastar Daughter Sreeja Konidela Clarity about Relationship - Sakshi

మెగాస్టార్‌ చిన్నకూతురు శ్రీజ కొణిదెల తాజాగా వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుక్కుగా ఉండే ఆమె పర్సనల్‌ లైఫ్‌లోనూ రకరకాల రూమర్స్‌ వినిపించాయి. కానీ.. తాజాగా శ్రీజ షేర్‌ చేసిన పోస్ట్‌తో వాటన్నింటికీ చెక్ పెట్టింది. ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా అంటూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాదిలో తనకిష్టమైన వ్యక్తి గురించి తెలుకున్నానంటూ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: ఆ వ్యక్తిని కలవడం అద్భుతం.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా : శ్రీజ)

అందరూ అనుకుంటున్నట్లు ఆమె ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేదు. నూతన ఏడాదిలో తనకు తానే కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నట్లు ఇన్‌స్టా స్టోరీలో తెలిపింది. స్వీయ రిలేషన్‌లో ఉండనున్నట్లు వెల్లడించింది. 'ఐ యామ్ లవింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ప్' అంటూ ఫోటో పోస్ట్ చేసింది. సాధారణంగా శ్రీజ ఫిట్‌నెస్‌, ట్రావెల్‌ వంటి విషయాలపై పోస్టులు పెడుతూ ఉంటుంది. ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ఆసక్తికరంగా మారడంతో ఫ్యాన్స్ కంగ్రాట్స్ తెలిపారు. గతేడాది గురించి ఆమె స్పందిస్తూ…‘2022 సంవత్సరం నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేసిందని పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఆమె సెల్ఫ్ రిలేషన్‌లో ఉండనున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement