చిరంజీవికి కరోనా పాజిటివ్‌ | Megastar Chiranjeevi Tests Coronavirus Positive | Sakshi
Sakshi News home page

చిరంజీవికి కరోనా పాజిటివ్‌

Nov 9 2020 10:56 AM | Updated on Nov 9 2020 2:17 PM

Megastar Chiranjeevi Tests Coronavirus Positive - Sakshi

గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను

సాక్షి, హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారినపడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే  హోమ్  క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’అని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, మూడు రోజుల క్రితం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వరద సాయం అందించారు. ఆయన వెంట హీరో నాగార్జున కూడా ఉన్నారు. నిన్న (ఆదివారం) టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌, తన తనయుడు రామ్‌చరణ్‌తో చిరంజీవి సెల్ఫీ దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement