ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్! | Sakshi
Sakshi News home page

Ram Charan: టాలీవుడ్ డైరెక్టర్‌ బర్త్‌ డే.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్!

Published Thu, Feb 15 2024 6:34 PM

Mega Hero Ram Charan Birthday Wishes To Director Buchi Babu Sana - Sakshi

మెగా హీరో, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్‌ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్‌ షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే 'గేమ్ ఛేంజర్' తర్వాత చెర్రీ మరో చిత్రానికి ఓకే చెప్పారు. ఉప్పెన్ ఫేమ్, డైరెక్టర్‌ బుచ్చిబాబుతో జతకట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ఆర్సీ16 అనే వర్కింగ్ టైటిల్‌ ఖరారు చేశారు. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అయితే ఇవాళ డైరెక్టర్‌ బుచ్చిబాబు సనా బర్త్‌డే కావడంతో పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలిపారు. తాజాగా రామ్ చరణ్‌ బర్త్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. డైరెక్టర్‌ బుచ్చిబాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ఏడాదిలో మీరు మరింత ప్రేరణ, ఆవిష్కరణలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. ఆర్‌సీ16 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని.. సరికొత్త ఉత్సాహంతో పనిచేద్దామని ట్విటర్‌లో రాసుకొచ్చారు. అంతకుముందే ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


 

Advertisement
 
Advertisement