
రంజిత్, సౌమ్య మీనన్ హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి. రామకృష్ణ పరమహంస ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ధర్మపురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమస్ కావటం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.
ఇక సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గుప్పెడంత సాంగ్ మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి "బేబీ ఒసేయ్ బేబీ" అనే మరో సాంగ్‌ని కూడా విడుదల చేశారు మేకర్స్. గేయ రచయిత కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటని సాకేత్, కీర్తన శర్మ ఆలపించారు.