మంగళవారం బ్యూటీ.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందంటే? | Sakshi
Sakshi News home page

ఊహించని విధంగా సినిమాల్లోకి.. ఇప్పుడేమో ఉద్యోగం వదిలేసి!

Published Fri, Dec 29 2023 5:30 PM

Mangalavaaram Actress Divya Works As Before Entering Into Cinemas - Sakshi

ఆర్‌ఎక్స్‌100 ఫేమ్ అజయ్‌ భూపతి మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో  తనకు అచొచ్చిన  హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధానపాత్రలో మంగళవారం చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 17న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గుట్టుగానే అజయ్ భూపతి మరోసారి తన మార్క్‌ను చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 

అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాకుండా ఈ చిత్రంలో నటీనటులు కూడా దాదాపుగా సినిమాల్లో కనిపించినవాళ్లే. కానీ ఈ మంగళవారం చిత్రంలో అందరినీ ఆకర్షించిన ఓ క్యారెక్టర్ ఉంది. లీడ్‌ క్యారెక్టర్‌ పాయల్‌ రాజ్‌పుత్ అయినప్పటికీ.. సినిమా చూసినంత సేపు తన పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు? సినిమాల్లోకి ఎలా వచ్చింది? అచ్చం తెలుగుమ్మాయిలా కనిపించిన ఆమె ఇంతకుముందే టాలీవుడ్‌ సినిమాల్లో నటించిందా? ఆ వివరాలు తెలియాలంటే ఓ లుక్కేద్దాం. 

పాయల్‌ రాజ్‌పుత్‌ తర్వాత మంగళవారం తన అందంతో మెప్పించిన నటి మరెవరో కాదు.. జమీందార్ భార్య. ఈ చిత్రంలో చైతన్యకు భార్యగా తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమెకు ఈ చిత్రం తెలుగులో మొదటి చిత్రమేమీ కాదు. మంగళవారం కంటే ముందే తగ్గేదేలే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది.

దివ్య ప్రస్థానం

ఆమె అసలు పేరు దివ్య పిళ్లై. కేరళకు చెందిన నారాయణ పిళ్లై, చంద్రిక దంపతులకు దివ్య దుబాయ్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులది కేరళలోని మావేలికర స్వగ్రామం. దివ్య పిళ్లై రెండవ కుమార్తె కాగా..  దుబాయ్‌లోనే చదువు పూర్తి చేసింది. ఇంజినీరింగ్‌ అయిపోయిన వెంటనే ఆమెకు దుబాయి ఎయిర్‌లైన్స్‌.. అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉద్యోగం వచ్చింది. 

కలిసొచ్చిన స్నేహితుని పెళ్లి

ఎయిర్‌లైన్ సిబ్బందిగా తన కెరీర్‌ను ప్రారంభించిన దివ్యకు అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది. ఆమె తన స్నేహితుడి వివాహానికి వెళ్లగా.. అక్కడ డైరెక్టర్‌ వినీత్‌ కుమార్‌ ఆమెను చూశారు. ఆ తర్వాత 2015 మలయాళంలో పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ హీరోగా నటించిన అయల్ నంజళ్ల అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. 

ఆ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ఊజం చిత్రంలో నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ సినిమాలు, మలయాళంలో ఇద్దరు టాప్ హీరోల సరసన చేయడంతో ఫుల్‌ ఫోకస్ సినిమాలవైపే మళ్లింది. ఎయిర్‌లైన్‌ సిబ్బందిగా కెరీర్‌ ప్రారంభించిన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. అంతకుముందు ఎలాంటి నటనా అనుభవం లేకపోయినా వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తోంది. 

తెలుగులో నవీన్ చంద్ర నటించిన తగ్గదేలే చిత్రంలో కనిపించింది. ఇటీవలే రిలీజైన ఆర్య వెబ్‌ సిరీస్‌ ది విలేజ్‌లోనూ కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా మాస్టర్ పీస్ (2017), సేఫ్ (2019) చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది మంగళవారం సినిమాతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న దివ్య పిళ్లై ప్రస్తుతం మార్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె సినిమాలతో పాటు మలయాళంలో సీరియల్స్‌, పలు షోలలో కనిపించింది. 

మంగళవారం కథేంటంటే?
1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊ‍ళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్‌పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement