అది మన నేల గొప్పదనం: మంచు లక్ష్మి | Manchu Lakshmi About Adiparvam | Sakshi
Sakshi News home page

అది మన నేల గొప్పదనం: మంచు లక్ష్మి

Published Wed, Jul 10 2024 12:08 AM | Last Updated on Wed, Jul 10 2024 12:08 AM

Manchu Lakshmi About Adiparvam

‘‘ఆదిపర్వం’ వంటి సోషియో ఫ్యాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నామంటే అది మన నేల గొప్పదనం. ఈ శక్తివంతమైన గడ్డ మీద ఉన్నాం కాబట్టే ఇలాంటి నేపథ్యాలతో సినిమాలు చేయగలుగుతున్నాం’’ అని నటి మంచు లక్ష్మి అన్నారు. సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో మంచు లక్ష్మి లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తేర్‌ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్‌ కిరణ్, సత్యప్రకాశ్, సుహాసిని ఇతర పాత్రల్లో నటించారు.

రావుల వెంకటేశ్వర్‌ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం పాట ఆవిష్కరణ కార్యక్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఇటీవల ‘యక్షిణి’ వెబ్‌ సిరీస్‌ చేశాను... చాలా మంచి స్పందన వచ్చింది.

ఇప్పుడు ‘ఆదిపర్వం’ చేశాను. దేవత అయినా దెయ్యం పాత్ర అయినా నన్నే సంప్రదిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఆదిపర్వం’లో నాగులాపురం నాగమ్మ పాత్ర చేశారు లక్ష్మి. ఆమె చేసిన యాక్షన్‌ సీక్వెన్సులు హైలైట్‌ అవుతాయి’’ అన్నారు సంజీవ్‌ మేగోటి. ‘‘ఈ చిత్రంలో నేను క్షేత్రపాలకుడి పాత్ర చేశాను’’ అన్నారు శివ కంఠంనేని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement