మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2027లో విడుదల కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేశ్‌బాబు ఏ దర్శకుడితో సినిమా చేయనున్నారనే చర్చ కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేశ్‌బాబుతో ఓ సినిమా చేయాలని సందీప్ రెడ్డి ప్రయత్నాలు చేశారనే వార్త అప్పట్లో ప్రచారమైంది. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని, మహేశ్‌బాబు–సందీప్ రెడ్డిల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపోందేందుకు సన్నా హాలు మొదలయ్యాయని భోగట్టా. ఇక ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’తో మహేశ్‌బాబు బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నారు సందీప్ రెడ్డి. ఇలా మహేశ్, సందీప్ తమ ప్రస్తుత ్రపాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత వీరి కాంబినేషన్‌లోని సినిమా పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


