Actor Madhavan: వారిని సినీ నిర్మాతలు గుర్తించడం లేదు: మాధవన్‌

Madhavan Rocketry The Nambi Effect Showing In Cannes Festival 2022 - Sakshi

Madhavan Rocketry The Nambi Effect Showing In Cannes Festival 2022: టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో మంచి గుర్తింపు ఉన్న నటుడు మాధవన్. ఇప్పటి వరకు హీరోగా, నటుడిగా అలరించిన మాధవన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మాధవన్‌ మొదటిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌'. ప్రస్తుతం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మాధవన్‌ చిత్రం 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌'ను ప్రదర్శించారు. అనంతరం ఈ కార్యక్రమంలో నిర్వహించిన చర్చలో భాగంగా మాధవన్‌తోపాటు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, నంబి నారాయణ్‌ చిత్ర నిర్మాత శేఖర్‌ కపూర్‌, గీత రచయిత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాధవన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

'ఆర్యభట్ట నుంచి సుందర్‌ పిచాయ్‌ వరకు సైన్స్ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ఇండియాకి చెందిన అనేక వ్యక్తులకు ఎన్నో అసాధరణమైన చరిత్ర ఉంది.  వీరికి సినీతారలు, నటీనటుల కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. యువతకు వారెంతో స్ఫూర్తి. కానీ ఇలాంటి వారిపై మేము సినిమాలు తీయడం లేదు.సైన్స్‌ అండ్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించి వరల్డ్‌వైడ్‌గా గుర్తింపు పొందిన వ్యక్తులను సినీ ప్రొడ్యూసర్స్‌ గుర్తించడం లేదు. క్రిస్టోఫర్ నోలాన్‌ సినిమాకు రివ్యూ ఇవ్వడానికి సమీక్షకులు భయపడతారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అర్థంకాకో, ఏదో ఒకటి రాసి ఫూల్‌ అవ్వడానికి ఇష్టపడరు. నిజం చెప్పాలంటే ఆయన తెరకెక్కించిన 'ఇన్‌సెప్షన్‌' నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ ఆయనకు సైన్స్‌పై ఉన్న పరిజ్ఞానం వల్ల ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది.' అని మాధవన్‌ తెలిపాడు.  
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top