బేబీ హీరోయిన్ హారర్‌ థ్రిల్లర్‌.. ట్రైలర్‌ చూశారా? | Sakshi
Sakshi News home page

Love Me If U Dare Movie: 'దెయ్యంతో ప్రేమలో పడితే'.. అంచనాలు పెంచేసిన ట్రైలర్

Published Thu, May 23 2024 8:13 PM

Love Me If You Dare Movie Release Trailer Out Now

ఆశిష్‌, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్‌ మీ. ఇఫ్‌ యు డేర్‌ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు.  తాజాగా ఈ సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్‌ చూస్తే హారర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దెయ్యంతో హీరో ప్రేమలో పడడం అనే కాన్సెప్ట్‌ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. హీరో, దెయ్యం మధ్య సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి.  ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. 

 

Advertisement
 
Advertisement
 
Advertisement