లావణ్య త్రిపాఠికి ‘టన్నెల్‌’ విషెస్‌.. రిలీజ్‌ వాయిదా! | Tunnel Team Congratulates Lavanya Tripathi on Baby Boy, Movie Release Postponed to Sept 19 | Sakshi
Sakshi News home page

లావణ్య త్రిపాఠికి ‘టన్నెల్‌’ విషెస్‌.. రిలీజ్‌ వాయిదా!

Sep 11 2025 4:54 PM | Updated on Sep 11 2025 5:26 PM

Lavanya Tripathi Tamil Movie Release Postponed

మెగా జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి బుధవారం (సెప్టెంబర్ 10) పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అంతా కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ‘టన్నెల్’ చిత్రబృందం కూడా లావణ్యకు విషెస్‌ తెలియజేసింది. 

ఈ చిత్రంలో అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు.రవీంద్ర మాధవ దర్శకత్వం  వహించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల  విడుదల కావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఓ వారం వాయిదా వేశారు. అలా ఈ మూవీని సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లోకి తీసుకు వచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

‘టన్నెల్’ ఓ యాక్షన్-థ్రిల్లర్ మూవీ అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అడ్రినల్ రష్ ఇచ్చేలా, ఉత్కంఠ రేకెత్తించేలా సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు అందరినీ సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాయి. క్రైమ్‌లు చేస్తున్న సైకోని పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు? అనే పాయింట్‌తో ‘టన్నెల్’ రాబోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement