KV Vijayendra Prasad Reveals Mahesh Babu Rajamouli Movie Starts in 2023 - Sakshi
Sakshi News home page

KV Vijayendra Prasad: మహేశ్‌-రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వచ్చేది అప్పుడే

Published Tue, May 10 2022 4:22 PM | Last Updated on Tue, May 10 2022 5:16 PM

KV Vijayendra Prasad Reveals Mahesh Babu and Rajamouli Movie Starts in 2023 - Sakshi

KV Vijayendra Prasad About Rajamouli, Mahesh Babu Movie: మహేశ్‌ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ మే 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ మూవీ తర్వాత మహేశ్‌, త్రివిక్రమ్‌తో సినిమాను స్టార్ట్‌ చేస్తాడని సమాచారం. ఇదిలా ఉంటే మహేశ్‌ హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై క్లారిటీ ఇచ్చారు సినీ రచయిత, రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్‌.

చదవండి: విజయ్‌పై బండ్ల గణేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటీవల ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయనకు జక్కన-మహేశ్‌ మూవీపై ప్రశ్నఎదురైంది. ఈ మూవీ సెట్‌పైకి వచ్చేది ఎప్పుడని అడగ్గా.. వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఇంక కథ పూర్తి కాలేదు. అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

చదవండి: హీరోయిన్‌ లైంగిక దాడి కేసు, దిలీప్‌ భార్యను విచారించిన పోలీసులు

త్వరలోనే మహేశ్‌ త్రివిక్రమ్‌తో మూవీ స్టార్ట్‌ చేయబోతున్నాడు. ఈ ఏడాది అంతా ఆ ప్రాజెక్ట్‌తోనే మహేశ్‌ బిజీగా ఉంటాడు. అందుకే రాజమౌళితో సినిమా 2023 ప్రారంభంలో స్టార్ట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు ఆయన. కాగా దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై ఈ సినిమాను కేఎల్‌ నారాయణ నిర్మించనున్నారు. ఇదిల ఉంటే ఈ ప్రాజెక్ట్‌పై ఇటీవల ఓ ఇంటర్య్వూలో మహేశ్‌ మాట్లాడుతూ.. రాజమౌళితో సినిమా చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement