కూతురి లాంటి ఆమెతో రొమాన్స్‌ చేయలేను.. స్టార్‌ హీరో ఆసక్తికర కామెంట్స్! | Vijay Sethupathi Revealed Why He Refused To Act Opposite Krithi Shetty In DSP | Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: ఆ హీరోయిన్‌తో రొమాన్స్‌ చేయలేను.. అందుకే రిజెక్ట్‌ చేశా!

Published Thu, Jun 6 2024 4:33 PM | Last Updated on Thu, Jun 6 2024 4:51 PM

Kollywood Star Hero Vijay Sethupathi Comments On Uppena Fame

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్‌ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.

ప్రస్తుతం విజయ్ ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.  తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగాఉప్పెన ఫేమ్‌ కృతిశెట్టిపై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో సినిమాలు ఒప్పుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. 

విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'నేను నటించిన డీఎస్పీ చిత్రంలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయనని చెప్పా. ఎందుకంటే ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించా. అది సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో నా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయలేనని చెప్పా. కూతురిగా భావించిన కృతిశెట్టితో నటించడం నా వల్ల కాదు' అని అన్నారు. కాగా.. గతంలోనూ విజయ్‌ సేతుపతి ఇదే విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్‌గా కృతిని ఎంపిక చేయగా తిరస్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement