
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తోన్న తాజా చిత్రం 'మదరాసి' (Madharaasi ). ఈ మూవీని మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ కనిపించనుది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇక రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మదరాసి ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు శివ కార్తికేయన్. తాజాగా బెంగళూరులో మదరాసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపైనే డ్యాన్స్తో అలరించాడు హీరో శివ కార్తికేయన్. ఈ చిత్రంలోని సలంబల అనే పాటకు తన స్టెప్పులతో అదరగొట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Witnessing this madness is real 😭🧿🫵#skgirlism #Sivakarthikeyan #nexus #Madharaasi pic.twitter.com/gIvFKpanEi
— •𝚜haranya•ツ (@Sk_girl_ism) August 28, 2025
కాగా.. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫుల్ హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ట్రైలర్ చూస్తేనే సరికొత్త ఎగ్జయిటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
#Madharaasi - Sivakarthikeyan performed the Hook steps of 'Salambala' at Bangalore pre release event 🕺🔥pic.twitter.com/mepInRSVyQ
— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2025