ఆ సినిమాలో యువరాణిగా కీర్తి లుక్‌, ఫొటో వైరల్‌

Keerthi Suresh New Look In Marakkar Goes Viral - Sakshi

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించిన మలయాళ తాజా చిత్రం ‘మరక్కర్‌: లయన్‌ ఆఫ్‌ ది అరేబియన్‌ సీ’. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్‌ జీవితం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు ప్రియదర్శన్  తెరకెక్కించాడు. గతేడాది 2020 మార్చి 26న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా ఈ ఏడాది వేసవికి వాయిదా పడింది. 2022లో కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉండటంతో మరోసారి ఈ మూవీ వాయిదా పడింది. కాగా ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్‌ మోహన్‌లాల్‌ (మోహన్‌లాల్‌ తనయుడు) కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీలోని కీర్తి సూరేశ్‌ న్యూలుక్‌ బయటకు వచ్చింది. సంగీతకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి కేరళ యువరాణిగా పట్టాభిషిక్తురాలైన యువతిగా కీర్తి పాత్ర కొనసాగనున్నట్లు సమాచారం. ఒంటినిండా ఆభరణాలు ధరించి రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో వీణ వాయిస్తున్నట్లు ఉన్న తన స్టిల్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కేరళ యువరాణిగా కీర్తి అదిరిపోయిందంటు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరక్కల్‌ మూవీ  విడుదలకు ముందే మూడు విభాగాల్లో(ఉత్తమ చిత్రం, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌) జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం. కాగా మరక్కర్‌.. ఓనమ్‌ పండగ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు ఇటీవల మోహన్‌లాల్‌ అధికారికంగా ప్రకటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top