'దాదా' హీరో కొత్త సినిమా.. అప్‌డేట్స్‌ ఇవే! | Sakshi
Sakshi News home page

Kavin: దాదా హీరో కొత్త మూవీ.. రిలీజయ్యేది అప్పుడే!

Published Fri, Dec 8 2023 12:15 PM

Kavin New Movie Star Details - Sakshi

యంగ్‌ హీరో కెవిన్‌ కథానాయకుడిగా నటించిన దాదా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రానికి స్టార్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి ప్యార్‌ ప్రేమ కాదల్‌ చిత్రం ఫేమ్‌ ఇళన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌, శ్రీనిధి సాగర్‌ కలిసి నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇందులోని పాటలన్నీ యూత్‌ను అలరించే విధంగా ఉంటాయంటున్నాయి చిత్ర వర్గాలు.

ఈ చిత్ర ప్రోమో వీడియోను యువన్‌ శంకర్‌ రాజా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్‌ వచ్చిందని పేర్కొన్నారు. ఇటీవల ఇందులోని ఓ సాంగ్‌ కోసం భారీ సెట్‌ వేసి చిత్రీకరించినట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి. ఇది నటుడు కెవిన్‌ ఇంతకు ముందు నటించిన చిత్రాల కంటే భిన్నంగానూ, భారీగానూ రూపొందిస్తున్న చిత్రం అని పేర్కొన్నాయి.

కాగా ఇది సినీ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందట. తెర వెనుక పలు ఆసక్తికరమైన అంశాలను ఆవిష్కరించే చిత్రంగా స్టార్‌ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న స్టార్‌ చిత్రాన్ని ఫిబ్రవరి 9వ తేదిన తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

చదవండి: తిరుపతిలో బిగ్‌ బాస్‌ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం

 
Advertisement
 
Advertisement