
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోతో బిజీగా ఉన్నాపు. ప్రస్తుతం 17వ సీజన్‌కు ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్ ఏకంగా కోటి రూపాయల ప్రశ్న వరకు దూసుకొచ్చింది. అయితే ఒక్క సమాధానం చెబితే కోటి రూపాయలు యువతి సొంతమయ్యేవి. కానీ ఊహించని విధంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే రూ.50 లక్షల ప్రైజ్‌మనీతోనే సరిపెట్టుకుంది. ఇంతకీ ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
తాజా ఎపిసోడ్‌లో ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల యువతి కశీష్ సింఘాల్ రూ. 50 లక్షలతోనే సరిపెట్టుకుంది. ఈ డబ్బుతో తన తండ్రి చేసినరూ. 15 లక్షల రుణాన్ని తిరిగి చెల్లిస్తానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ యువతి సమాధానం చెప్పలేకపోయిన ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో చూసేద్దాం.
ప్రశ్న: విసిగోత్ రాజ్యానికి చెందిన ఏ రాజు రోమ్ నగరంపై దాడి చేయకుండా ఉండేందుకు మిరియాలు డిమాండ్ చేశాడు?
ఎ) లుడోవిక్, బి) ఐమెరిక్, సి) అలారిక్ డి) థియోడోరిక్ ఆప్షన్స్ ఇవ్వగా.. కశీష్ సింఘాల్ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో ఆట నుంచి నిష్క్రమించింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి..అలారిక్ అంటూ అమితాబ్ చెప్పారు. రూ.50 లక్షలు గెలిచిన ఆమె తన జర్నీని పంచుకని అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఈ రియాలిటీ షో సోనీటీవీతో పాటు సోనీలివ్ ఓటీటీలోనూ ప్రసారమవుతోంది.