
ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుతో ‘బైకాట్ కంగనా’ అనే హ్యాష్ ట్యాగ్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ట్విటర్ వేదికగా కంగనా స్పందిస్తూ బాలీవుడ్ మాఫియాపై అంటూ విరుచుకుపడ్డారు. ‘ఎలుకలు ఇప్పుడు వాటి కలుగుల నుంచి బయటకు వస్తున్నాయి. నా సినీ జీవితాన్ని, ఫేంను నాశనం చేయాలనే ఉద్దేశంతో నా పేరుతో #Boycott_Kangana అనే పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పరిశ్రమలో స్టార్‌కిడ్స్‌ల ఎదుగుల కోసమే ఇదంతా చేశారనిపిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: మూవీ మాఫియాపై కంగనా ఫైర్)
Wonderful #Boycott_Kangana trending, चूहे बिलों से बाहर आ रहे हैं, चलो थोड़ा हाथ पैर तो माफ़िया भी मारेगी 🙂
— Kangana Ranaut (@KanganaTeam) August 24, 2020
అంతేగాక బాలీవుడ్ మాఫియా చేయగలిగిన పనులన్నీ చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పుడు నా పేరును బ్యాన్ చేయాలంటూ హ్యాష్‌ను ట్యాగ్‌ను ట్రెండ్ చేయడమే కాకుండా నా ట్విటర్ ఖాతాను కూడా తొలగించేందుకు ఈ మాఫియా కట్రలు చేస్తోందని ఆరోపించారు. వారు ఇదంతా చేసేలోగా తానే కొందరి వ్యవహారాలను బయటపెడతానంటూ కంగనా హెచ్చరించారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి కంగనా స్టార్ కిడ్స్, నిర్మాత కరణ్ జోహర్‌లతో పాటు, పలువురు నటీనటులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అంతేగాక బాలీవుడ్‌లో ఓ వర్గంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నారు.
(చదవండి: ఆ అవార్డుకు కరణ్ అనర్హుడు: కంగనా)