స్టంట్‌ స్టార్ట్‌ | Kamal Haasan next movie directed by action choreographers Anbariv | Sakshi
Sakshi News home page

స్టంట్‌ స్టార్ట్‌

Sep 13 2025 4:36 AM | Updated on Sep 13 2025 4:36 AM

Kamal Haasan next movie directed by action choreographers Anbariv

కమల్‌హాసన్‌ కొత్త చిత్రం ప్రారంభమైంది. కమల్‌హాసన్‌ కెరీర్‌లోని ఈ 237వ సినిమాతో ‘కేజీఎఫ్, ఖైదీ, అమరన్, కల్కి 2898 ఏడీ’ వంటి సూపర్‌హిట్‌ సినిమాలకు పని చేసిన స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ అన్బు–అరివు ద్వయం దర్శకులుగా పరిచయం అవుతున్నారు. 2024 ప్రారంభంలోనే ఈ చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సెట్స్‌కు వెళ్లలేదు.

కాగా ఈ సినిమా పనులు ప్రారంభమయ్యాయని, ‘ప్రేమలు, రైఫిల్‌క్లబ్‌’ వంటి హిట్‌ చిత్రాలకు స్క్రీన్‌ రైటర్‌గా పని చేసిన శ్యామ్‌ పుస్కరన్‌ ఈ సినిమాకు అసోసియేట్‌ అయ్యారని చిత్రయూనిట్‌ శుక్రవారం అధికారికంగా పేర్కొంది. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే... ఫైట్‌ మాస్టర్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈ చిత్రం యాక్షన్‌ ప్రాధాన్యంగా ఉంటుందని, కమల్‌ రిస్కీ స్టంట్స్‌ చేయనున్నారని కోలీవుడ్‌ టాక్‌.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement