రోడ్డు ప్రమాదంలో కాజల్‌ అగర్వాల్‌.. తాను క్షేమం అంటూ పోస్ట్‌ | Kajal Aggarwal Reacts To Fake News In Social Media Over Her Health, Post Goes Viral | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కాజల్‌ అగర్వాల్‌.. తాను క్షేమం అంటూ పోస్ట్‌

Sep 9 2025 8:19 AM | Updated on Sep 9 2025 10:43 AM

Kajal agarwal trouble social media fake news

వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన  కాజల్ అగర్వాల్‌కు టాలీవుడ్‌లో భారీగానే అభిమానులు ఉన్నారు. కన్నప్పలో చివరిసారిగా కనిపించిన ఆమె బాలీవుడ్‌ రామాయణలో నటించనుంది. అయితే, ఆమె రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె తన ఎక్స్‌ పేజీలో రియాక్ట్‌ అయింది.

'నేను ప్రమాదానికి గురైనట్లు కొన్ని నిరాధారమైన వార్తలను చూశాను. ఇక లేనని కూడా! కూడా ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. వాటిని చూసిన తర్వాత నేను ఎంతో నవ్వుకున్నాను. అంతకు మించిన ఫన్నీ న్యూస్‌ ఏమీ ఉండదు. పూర్తిగా అవాస్తవం ఉన్న వార్తలను వైరల్‌ చేయాల్సిన పనిలేదు. దేవుని దయవల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. అంతేకాకుండా మరింత బాగానే ఉన్నానని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రేమ, కృతజ్ఞతతో మీ కాజల్‌' అంటూ ఆమె పోస్ట్‌ చేసింది.

కాజల్ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతోందని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. ఇలాంటి పుకార్లు ఎక్కడి నుండి వచ్చాయో , అవి ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియాల్సి ఉంది. కానీ, కాజల్ స్వయంగా సకాలంలో వివరణ ఇవ్వడం ఆమె అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement