'కే3 కోటికొక్కడు' సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | K3 Kotikokkadu Movie Gets Release Date | Sakshi
Sakshi News home page

'కే3 కోటికొక్కడు' సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Fri, Sep 9 2022 3:51 PM | Last Updated on Fri, Sep 9 2022 3:54 PM

K3 Kotikokkadu Movie Gets Release Date - Sakshi

ప్రేక్షకులు సపోర్ట్‌ చేయాలి ‘‘కే3 కోటికొక్కడు’ సినిమా కన్నడలో బ్లాక్‌ బస్టర్‌ అయింది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా సపోర్ట్‌ చేయాలి’’ అన్నారు శ్రేయాస్‌ శ్రీనివాస్‌. కిచ్చా సుదీప్‌ హీరోగా శివ కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్‌ సినిమా గ్రూప్‌ బ్యానర్‌పై శ్రేయాస్‌ శ్రీనివాస్, దేవేంద్ర డీకే ఈ నెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఈ చిత్రం ఆడియోను లాంచ్‌ చేశారు. శ్రేయాస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలు అద్భుతంగా వచ్చాయి. సింహా, గీతా మాధురి, లిప్సిక, సత్యమణి, సాయి చరణ్‌ పాడారు. ఈ నెల 13న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరపనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: సాయికృష్ణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement