చరణ్ సినిమాలో జాన్వీ కన్ఫర్మ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా? | Janhvi Kapoor Confirmed Female Lead In Ram Charan Movie | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: తెలుగు సినిమాలు.. హాట్ బ్యూటీ ఆ కండీషన్స్!

Feb 19 2024 1:49 PM | Updated on Feb 19 2024 2:56 PM

Janhvi Kapoor Confirmed Female Lead In Ram Charan Movie - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ చాలామందికి తెలుసు. చిన్నప్పటి నుంచి ఈమెని అభిమానులు చూస్తూ వచ్చారు. అయితే బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ అయితే లేవు. కానీ 2024లో మాత్రం ఈమె దశ మారిపోయినట్లు కనిపిస్తుంది. తాజాగా రామ్ చరణ్ సినిమాలోనూ ఈమెనే హీరోయిన్‌గా ఖరారైందని ఈమె తండ్రి బోనీ కపూర్ చెప్పేశారు.

(ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో)

హిందీ సినిమాల వల్ల జాన్వీకి అంతంత మాత్రంగానే పేరు వచ్చింది. ఎప్పుడైతే ఎన్టీఆర్‌ 'దేవర'లో ఈమెనే హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందో ఈమె లక్ కాస్త మారిందని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదలైతే ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ దీనికంటే ముందే రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో జాన్వీనే హీరోయిన్‌గా చేయబోతుంది. తాజాగా ఈమె తండ్రి బోనీ కపూర్.. ఈ విషయాన్ని ఖరారు చేశారు.

అయితే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడమే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ కొన్ని కండీషన్స్ పెడుతోందట. దాదాపు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. తెలుగులో స్టార్ హీరోయిన్ లకు ఇచ్చే రెమ్యునరేషన్ ఇది. ఇక్కడ ఒక్క మూవీ చేయకుండానే ఇంత డిమాండ్ చేస్తోంది. అలానే తెలుగులో స్టార్ హీరోలవి తప్పితే మిగతా చిత్రాల్లో నటించకూడదని కూడా ఫిక్సయిందట. ఇప్పుడు ఈ విషయాలే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.

(ఇదీ చదవండి: అనుపమ అభిమాని వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement