
ఒకప్పడు హీరోగా రాణించిన జగపతి బాబు..ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. లెజెండ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ బడా ప్రాజెక్టుల్లో నటిస్తూ తన క్రేజ్‌ను రోజు రోజుకీ పెంచుకుంటూ ముందుకెళ్లిపోతున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్‌లపై దృష్టిపెడుతున్నారు. ఇటీవలే ‘పరంపర’ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం జగపతి బాబు సలార్ తో పాటు ఎన్టీఆర్ 30వ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
(చదవండి: ముంబైలో సీనియర్ స్టార్స్ సందడి.. ఫోటోలు వైరల్)
జగపతి బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూనే ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ వేస్తుంటాడు. కొటేషన్లు షేర్ చేస్తుంటాడు. వేధాంతం వల్లిస్తుంటాడు. తాజాగా జగపతి బాబు.. సాయిబాబాకు పూజ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. ‘దేవుడా.. అందరూ నా దగ్గర ఉందనుకుంటున్న డబ్బు నాకిచ్చెయ్.. చెప్పలేక చస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. జగ్గూభాయ్ చేసిన ఈ ఫన్నీ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ముందుగా మీ దగ్గర ఉన్న డబ్బు నాకు ట్రాన్స్‌ఫర్ చేయండి.. ఆ తర్వాత దేవుడు మీకు పంపిస్తాడు’, నీ కోరిక ఈ దేవుడి దగ్గర నెరవేరదు.. ‘లక్ష్మీదేవి లేదా కుభేరుడిని పూజిస్తే.. నీ కోరిక నెరవేరుతుంది’ అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
Devuddaa...Andharu naa daggara undhanukuntuna dabbu naaku iccheyi...cheppaleka Chastuna. pic.twitter.com/mGpe9D4Ty5
— Jaggu Bhai (@IamJagguBhai) November 13, 2022