IQ Movie Review In Telugu: ఐక్యూ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?

IQ Movie Review and Rating in Telugu - Sakshi

సినిమా : ఐక్యూ" " (పవర్ అఫ్ స్టూడెంట్స్)
నటీ నటులు: సాయి చరణ్, పల్లవి, ట్ర్యాన్సీ,సుమన్, బెనర్జీ, సత్య ప్రకాష్, సూర్య,పల్లె రఘునాథ్ రెడ్డి, జబర్దస్త్ శేషు, గీతా సింగ్, లక్ష్మీ రావు, సత్తిపండు, జ్ఞానేశ్వర్ రావు, శీలం శ్రీనివాసరావు, సీఎం రెడ్డి, వాసు వర్మ, తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శ్రీనివాస్ GLB 
కథ, మాటలు, సంగీతం : పోలూరు ఘటికాచలం 
బ్యానర్ : కె. యల్. పి మూవీస్ 
సమర్పణ :కాయగూరల రాజేశ్వరి 
నిర్మాత : కాయగూరల లక్ష్మీ పతి
కెమెరా : టి. సురేందర్ రెడ్డి

సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీనటులుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన చిత్రం "ఐక్యూ" (పవర్ అఫ్ స్టూడెంట్స్). జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథ
ఇది ఒక బ్రెయిన్‌కు సంబంధించిన సినిమా. మిడిల్ క్లాస్ అమ్మాయి భూమిక (పల్లవి) చాలా తెలివి గల అమ్మాయి. చిన్నతనం నుంచే యాక్టివ్‌గా ఉంటూ తనకున్న ఐక్యూతో కౌన్ బనేగా కరోడ్ పతి పోటీలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకొంటుంది. ఆలా గెలుచుకున్న డబ్బును మిడిల్ క్లాస్ విద్యార్థుల చదువులకు ఖర్చు పెడుతుంది. తన పీ.హెచ్.డి అయిన తరువాత ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యి ఎంతోమంది విద్యార్థులను మేటి పౌరులుగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తుంది. మంచి తెలివి ఉన్నప్పటికీ అదే కాలేజీలో తన ఫ్రెండ్స్‌తో కలసి అల్లరి చిల్లరగా తిరుగుతున్న వివేక్‌ గ్యాంగ్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తుంది. అలా వచ్చిన భూమికను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.

అయితే భూమికను కిడ్నాప్ చేసి తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు. మరో వైపు తనలో ఉన్న ఐక్యూను చూసిన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ అమ్మాయి మెదడును అమ్మడానికి ఒక డీల్ కుదుర్చుకొని కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తాడు. ఇంతకీ భూమికను వివేక్ కిడ్నాప్ చేశాడా? లేక ప్రొఫెసర్ చేశాడా? ఆమెతో పాటు ప్రాజెక్ట్స్ వర్క్ చేసే అజయ్ చేశాడా? దాని వల్ల జరిగిన పరిణామాలు ఏంటి? ఈ కేసును పోలీసులు ఎలా చేధించారు? అనేది తెలుసుకోవాలంటే "ఐక్యూ" సినిమా చూడాల్సిందే!

నటీ నటుల పనితీరు
వివేక్ పాత్రలో నటించిన సాయి చరణ్‌కు ఇది మొదటి చిత్రమైనా బాగానే యాక్ట్‌ చేశాడు. మంచి ఐక్యూ ఉన్న అమ్మాయి భూమికగా పల్లవి తన పాత్రలో ఒదిగి పోయింది. భూమిక కేసును ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ కమిషనర్‌ పాత్ర పోషించిన సుమన్ నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు. మిగతా వారందరూ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు 
"ఐక్యూ" అంటే మేధస్సుకు సంబంధించిన చిత్రం. అన్ని రంగాల్లో మాఫియా వచ్చింది. విద్యారంగంలో కూడా మాఫియా వస్తే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అనే కొత్త పాయింట్ సెలెక్ట్ చేసుకొని చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీనివాస్ GLB. ఎంటర్‌టైన్‌ చేసే విషయంలో డైరెక్టర్‌ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. టి.సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సీనియర్ రైటర్ ఘటికాచలం అందించిన మ్యూజిక్‌ పర్వాలేదనిపిస్తుంది. జీవితంలో అప్పుడప్పుడూ అల్లరి చేయచ్చు. కానీ జీవితమే అల్లరిపాలు కాకూడదు అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. శివషర్వాణి ఎడిటింగ్‌కు ఇంకాస్త కత్తెర వేయాల్సింది. ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని అందించారు.

చదవండి: శర్వానంద్‌ పెళ్లి సందడి షురూ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top