IPL Movie Review: ఐపీఎల్ మూవీ రివ్యూ | IPL Its Pure Love Telugu Movie Review | Sakshi
Sakshi News home page

IPL Movie Review: ఐపీఎల్ మూవీ రివ్యూ

Feb 10 2023 9:46 PM | Updated on Feb 10 2023 9:54 PM

IPL Its Pure Love Telugu Movie Review - Sakshi

టైటిల్   : ఐపీఎల్(ఇట్స్ ప్యూర్ లవ్)

నటీనటులు:  విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, అర్చన్ గౌతమ్, అవంతిక, సుమన్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్, రచ్చ రవి, రామ్ ప్రసాద్
నిర్మాణ సంస్థ: అంకిత మీడియా హౌస్
నిర్మాత:  బీరం శ్రీనివాస్
దర్శకత్వం:సురేష్ లంకలపల్లి
సంగీతం: వెంగీ
సినిమాటోగ్రఫీ: ఏకే ఆనంద్
ఎడిటర్: జానకి రామ్
విడుదల తేది: ఫిబ్రవరి 10, 2023

మన దేశంలో క్రికెట్ ఆటకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. క్రికెటర్లను దేవుళ్లా ఆరాధిస్తుంటారు. అయితే ఆ క్రికెట్ ఆట చుట్టూ టెర్రరిజం నేపథ్యాన్ని ఎంచుకుంటే.. దానికి ప్రేమ కథను జోడిస్తే ఎలా ఉంటుంది అనేది ఐపీఎల్.. ఇట్స్ ప్యూర్ లవ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి రివ్యూలో చూద్దాం.

అసలు కథేంటంటే...

ఈ సినిమాలో ఇమ్రాన్ ఓ టెర్రరిస్ట్. క్రికెట్ ఆటలో ఇండియా నెంబర్ వన్‌గా ఉండటాన్ని సహించలేకపోతాడు. అతను పాకిస్థాన్‌ను నెంబర్ వన్ స్థానంలోకి తీసుకురావాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తన తమ్ముడు సలీం చేత ఇండియాలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో జట్లను కొంటాడు. శ్రీరామ్‌(నితిన్) మంచి క్రికెటర్. తనకున్న ఆవేశం వల్ల సెలెక్ట్ కాలేకపోతాడు. అయితే వరుణ్‌ (విశ్వ కార్తికేయ) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటాడు. అక్కడ అతని బాస్ జాన్వీ (అర్చనా గౌతమ్)తో లవ్ ట్రాక్ కూడా ముందుకు సాగుతుంది. ఈ కథలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఎలా జరిగాయి? వాటి వల్ల వరుణ్‌, శ్రీరామ్‌ల లైఫ్‌లో జరిగిన సంఘటనలు ఏంటి? టెర్రరిస్ట్‌లు వేసిన పథకం చివరకు ఎలా ముగిసింది? అనేది థియేటర్లో చూడాల్సిందే.

కథ ఎలా ఉందంటే..

ఐపీఎల్ అంటే కొత్త మీనింగ్ ఇచ్చారు మేకర్లు. అసలే ఇండియాలో క్రికెట్‌కు వీరాభిమానులుంటారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే క్రికెటర్లను ఆరాధిస్తుంటారు. ఐపీఎల్ అంటూ క్రికెట్ నేపథ్యంలో సినిమా తీయడంతో యూత్ ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసేలా ఉంది. ఇక ఇందులో బెట్టింగ్స్ జరిగే తీరు, వాటికి యూత్ ఎలా అడిక్ట్ అయిందనే విషయాన్ని అంతర్లీనంగా చూపించారు.

ప్రథమార్థం కాస్త గందరగోళంగా సాగుతుంది. ఇక ప్రథమార్థంలో ఐపీఎల్ మ్యాచ్‌ల చుట్టూ కథ తిరగడంతో కాస్త స్పీడందుకున్నట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్‌లు అంత ప్రభావం చూపినట్లు అనిపించదు. కానీ కొత్త వారితో డైరెక్టర్ చేసిన ప్రయత్నం పర్వాలేదనిపించేలా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే..

యూత్‌ ఆడియెన్స్‌ను మెప్పించేలా వరుణ్‌, శ్రీరామ్ పాత్రలుంటాయి.  నితిన్, విశ్వ కార్తికేయలు చక్కగా పోషించారు. లవ్, ఎమోషనల్, యాక్షన్ సీన్స్‌లో కూడా మెప్పించారు. ఇక హీరోయిన్లుగా కనిపించిన అవంతిక, అర్చనలు నటనతో మెప్పించారు. కుమార్ సాయి, రచ్చ రవి ఇలా మిగిలిన పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ఫ్రేమ్ అంతా కూడా కలర్ ఫుల్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్‌లో కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నా.యి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement