Intinti Gruhalakshmi Today Episode June 23rd: అంకితకు ఝలకిచ్చిన అభి, దివ్య - Sakshi
Sakshi News home page

Intinti Gruhalakshmi: అంకితకు ఝలకిచ్చిన అభి, దివ్య

Jun 23 2021 2:59 PM | Updated on Jun 23 2021 3:34 PM

Intinti Gruhalakshmi June 23: Abhi Quits His Job - Sakshi

చిర్రెత్తిపోయిన అంకిత.. నా ముందు నిలబడటానికి అర్హత లేని నువ్వు నాకు సుద్దులు చెప్తున్నావా? అని మండిపడింది...

ఇంటింటి గృహలక్ష్మి జూన్‌ 23వ ఎపిసోడ్‌: నువ్వు కనిపించినప్పుడల్లా కంపరం వేస్తోందంటూ అంకిత శృతిని చీదరించుకుంది. దీంతో శృతి ఎంతగానో బాధఫడింది. మీరందరూ బాగుండాలని, ఈ ఇంటివాళ్లు క్షేమంగా ఉండాలని అందు కోసం తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పింది. కానీ నువ్వు మాత్రం చెప్పుడు మాటలు విని మోసపోకని అంకితను హెచ్చరించింది. దీంతో చిర్రెత్తిపోయిన అంకిత.. నా ముందు నిలబడటానికి అర్హత లేని నువ్వు నాకు సుద్దులు చెప్తున్నావా? అని మండిపడింది. నిన్ను అందరూ అసహ్యించుకునేలా చేయనిదే తన పగ చల్లారదని చెప్పి అక్కడ నుంచి విసురుగా వెళ్లిపోయింది.

అభిని వీలైనంత త్వరగా తన వాళ్ల దగ్గర నుంచి దూరం చేయాలని ఆ ఇంట్లో అడుగు పెట్టిన అం​​కితకు షాకిచ్చాడు అభి. తను ఉద్యోగం మానేశానని, పైగా ఫారిన్‌ వెళ్లడం లేదంటూ బాంబు పేల్చాడు. మీ అమ్మ మాటలు వినడం వల్లే బిడ్డను దూరం చేసుకున్నామని, ఇంకా వాళ్ల నిర్ణయాలకు తల వంచాల్సిన అవసరం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. దీంతో కొంత కంగారుపడ్డ అంకిత.. ఇప్పుడు తనేమన్నా చివరికి మాత్రం తన మాటకు తలొగ్గాల్సిందేనని లోలోపలే అభిప్రాయపడింది.

ఇక దివ్య ల్యాప్‌టాప్‌ పాడైందని ప్రేమ్‌ తన డబ్బులతో ట్యాబ్‌ తీసుకొచ్చాడు. సరిగ్గా అప్పుడే అంకిత కూడా ల్యాప్‌టాప్‌ తీసుకొచ్చి ఆమెకు ఇవ్వబోయింది. అయితే దాన్ని తీసుకునేందుకు దివ్య నిరాకరించింది. ప్రేమ్‌ అన్న ఇచ్చిన గిఫ్ట్‌ మాత్రమే తీసుకుంటానంటూ అంకితకు ఝలకిచ్చింది. ఇక నందు తల్లిదండ్రులు పెళ్లి చేసుకుని 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుదామని తులసి కుటుంబం ప్లాన్‌ వేసింది. కానీ ప్లాన్‌లు వేస్తే సరిపోదని, సెలబ్రేషన్‌ చేయడానికి సొమ్ములుండాలని దెప్పి పొడిచింది అనసూయ.

అయితే నందు వచ్చి ఈ వేడుకను రిసార్ట్‌లో జరిపించాలనుకుంటున్నట్లు చెప్తాడు. దీనికి అతడి తండ్రి ససేమీరా కుదరదని తేల్చి చెప్తాడు. దీంతో ఆవేశపడ్డ నందు.. తన మాటను కాదంటే నీ కొడుకు చచ్చిపోయినట్లేనంటాడు. మరి నందు కోరికను అతడి తండ్రి మన్నిస్తాడా? ఈ వేడుకలు తులసి ఇంట్లో జరుగుతాయా? లేదా రిసార్ట్‌లో జరగనున్నాయా? అనేది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.

చదవండి: తోటలో పండ్లు తెంపి అమ్ముకుంటున్న నరేశ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement