జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది | Hrudayam Murali Release Press-Meet | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది

Jul 9 2026 6:01 AM | Updated on Jul 9 2026 6:01 AM

Hrudayam Murali Release Press-Meet

– అథర్వ 

‘‘హృదయం మురళి’ సినిమా కోసం రెండేళ్లు కష్టపడి పని చేశాం. వన్‌ సైడ్‌ లవర్స్‌ మా సిని మాతో చాలా కనెక్ట్‌ అవుతారు. ఈ చిత్రం ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది’’ అని హీరో అథర్వ అన్నారు. ఆకాష్‌ భాస్కరన్‌ దర్శకత్వంలో అథర్వ, ప్రీతి ముకుందన్, కయాదు ప్రధాన పాత్రల్లో ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘హృదయం మురళి’. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించి, కీలక పాత్రలో నటించారు. 

ఈ సినిమాని మైత్రి డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో ప్రీతి ముకుందన్‌ మాట్లాడుతూ– ‘‘హృదయాన్ని హత్తుకునే ప్రేమకథా చిత్రం ఇది’’ అన్నారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్‌ శశి మాట్లాడుతూ– ‘‘గతంలో వచ్చిన ‘హృదయం’ మూవీ ఎంత బ్లాక్‌బస్టర్‌ అయిందో, ‘హృదయం మురళి’ కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం’’ అని చెప్పారు. ‘‘ప్రేమ, స్నేహం గురించి చెప్పే అద్భుతమైన సినిమా ఇది’’ అన్నారు నటుడు సెల్వన్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement