క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న శర్వానంద్‌!

Hero Sarwanand Going to Act in The Direction of Ajay Bhupati - Sakshi

ఆర్‌ ఎక్స్‌ 100 సినిమా ఎంత సూపర్‌ డూపర్‌ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్‌ఎక్స్ 100 సినిమా తన మొదటి  సినిమా అయినప్పటికీ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి మంచి హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. అందరినీ ఆకట్టుకునేలా మంచి కాన్సెప్ట్‌తో వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఇప్పుడు ఈ డైరెక్టర్‌ హీరో శర్వానంద్‌తో సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. రణరంగం, జాను సినిమాలు ప్లాప్‌ కావడంతో శర్వానంద్‌ కొద్దిగా వెనుకబడ్డారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాకు మహా సముద్రం అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ డైరెక్టర్‌ శర్వానంద్‌ కోసం ఎలాంటి కథను తయారు చేశాడో తెలియాల్సివుంది.  చదవండి: కన్నుమూసిన ‘లవకుశ’ నాగరాజు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top