కన్నుమూసిన ‘లవకుశ’ నాగరాజు

Nagaraju Who Acted as Lava in Lava Kusa Cinema Died - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘లవకుశ’ సీత రాములను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ సినిమా ఇప్పటికీ చెక్కుచెదరిని ఒక అపురూప చిత్రం. అందులో లవ, కుశలుగా నటించిన ఇద్దరు పిల్లలు సినిమాకే హైలెట్‌గా నిలిచారు. వారి హావ భావాలు ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేశారు. ఆ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆ ఇద్దరు పిల్లలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంటారు. వారు పెరిగి పెద్దవారయినప్పటకీ లవ, కుశలుగానే అందరి చేత గుర్తింపు పొందారు. 

లవకుశ సినిమాలో లవుడుగా తన ముద్దు ముద్దు మాటలతో అందరిని అలరించిన బాలుడి పెరుగు నాగరాజు. అమ్మమీద అమితమైన ప్రేమ, తండ్రినే ఎదిరించే సాహసం రెండు కలగలిపిన పాత్ర లవడుది. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఆ సినిమాలో రాముడి పాత్ర పోషించగా ఆయననే ఎదిరించి యుద్దం చేస్తారు మన లవకుశలు. ఆ సినిమా ద్వారా ఎందరినో ఆకట్టుకున్న నాగరాజు సోమవారం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నాగరాజు మరణం పట్ల సినిమా పరిశ్రమకు చెందిన వారు, ‘లవకుశ’ అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి: తోలుబొమ్మల సిత్రాలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top