Karthikeya Wedding Reception: కళ్లు చెదిరె అరెంజ్‌మెంట్స్‌తో కార్తికేయ వెడ్డింగ్‌ రిసెప్షన్‌

Hero Karthikeya Wedding Reception Photos Goes Viral - Sakshi

యంగ్‌ హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లోహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌ వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య జరిగిన వీరి వివాహ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, తణికెళ్ల భరణి, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Actor Karthikeya Marriage

Karthikeya Marriage Photos

ఈ నేపథ్యంలో పెళ్లైన మూడు రోజులకు బుధవారం(నవంబర్‌ 24) రాత్రి వారి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్నేహితులు, సన్నిహితులు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్‌కు తెలుగు సినీ ప్రముఖులతో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా హజరయ్యారు. కళ్లు చెదిరే అరెంజ్‌మెంట్స్‌తో వీరి రిసెప్షన్‌ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి, ఆది సాయికుమార్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.

Karthikeya Marriage Reception Photos

వరంగల్ నీట్‌లో బీటెక్‌ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసిందట. 2012లో లోహితకు ప్రపోజ్‌ చేసిన కార్తీకేయ హీరో అయ్యాకే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడ‌తాన‌ని చెప్పాడట. అలా హీరో అవ్వ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో త‌న ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికి కూడా కార్తీకేయ అంతే క‌ష్ట‌ప‌డ్డాడు. ఫైన‌ల్‌గా యూత్ హీరోగా నిల‌దొక్కుకుని పెద్ద‌ల‌ను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక సినిమా విషయాలకొస్తే.. కార్తికేయ ఇటీవల ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం తల అజిత్  ‘వాలిమై’లో విలన్ గా నటిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top