Harrdy Sandhu: ఆర్థిక కష్టాలు.. ఇంటి అద్దె, కారు ఈఐమ్‌ఐ కట్టలేని పరిస్థితి!

Harrdy Sandhu: I Didnot Have Money to Pay My Rent in Chandigarh - Sakshi

బాలీవుడ్‌లో గాయకుడిగా, నటుడిగా ఎదుగుతున్నాడు హార్డీ సంధు. అతడు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికంటే ముందు క్రికెటర్‌గా రాణించాడన్న విషయం తెలిసిందే! ఫాస్ట్‌ బౌలర్‌గా ఎన్నో మ్యాచ్‌లు ఆడిన హార్డీ.. తన మోచేతికి తగిలిన గాయం వల్ల క్రికెట్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత తనలో ఉన్న గాన ప్రతిభకు పదును పెడుతూ పంజాబీలో ఎన్నో పాటలు పాడాడు. ఇవి సూపర్‌ హిట్‌ కావడంతో పెద్ద సినిమాలకు సైతం పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత తనలోని నటుడిని సైతం వెలికితీశాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'2013-14 మధ్యకాలంలో నేను పాడిన సోచ్‌ పాట బ్లాక్‌బస్టర్‌ హిట్టయింది. దీంతో ఏడెనిమిది షోలు చేశాను. నేను పంజాబీ కావడంతో లగ్జరీ కార్ల మీద ఎక్కువ మోజుండేది. డబ్బులొస్తున్నాయి కదా అని ఓ కారు కొనుక్కున్నాను. సోచ్‌, జోకర్‌, సాహ్‌.. ఇలా వరుసగా మూడు హిట్‌ సాంగ్స్‌ ఇచ్చాను. కానీ ఓ స్టేజీకి వచ్చేసరికి నాకు ఒక్క షో కూడా రాలేదు. నేను పాడిన పాటలేవీ పెద్దగా పేలలేదు. నాకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వల్ల బయట ఎక్కడా పాడలేను. ఆ సమయంలో కారు ఈఎమ్‌ఐ కట్టడానికి కూడా కష్టమైంది. అంతెందుకు చండీఘర్‌లో ఇంటి అద్దె కట్టడానికి కూడా ముప్పుతిప్పలు పడ్డాను. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా తగ్గిపోయింది. అప్పుడు నేను డబ్బు సంపాదించడం కోసం నటించడం మొదలుపెట్టాను. అలా యాక్ట్‌ చేస్తూనే కమర్షియల్‌గా హిట్టయ్యే సాంగ్స్‌ పాడటం స్టార్ట్‌ చేశా' అని చెప్పుకొచ్చాడు హార్డీ సంధు. కాగా హార్డీ చివరగా కోడ్‌ నేమ్‌ తిరంగా సినిమాలో నటించాడు. ఈ మూవీలో కీ కరియే అనే పాట కూడా అతడే స్వయంగా ఆలపించాడు.

చదవండి: పఠాన్‌ను ఎవరూ ఆపలేరుగా.. ఎన్ని వందల కోట్లు వచ్చాయంటే?
అసభ్యంగా తాకబోయాడు.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన నటుడు

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top