Shah Rukh Khan starrer Pathaan movie Day 5 Box Office Collection - Sakshi
Sakshi News home page

Pathaan Movie: ఆగని పఠాన్‌ ప్రభంజనం.. 5 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

Jan 30 2023 3:09 PM | Updated on Jan 30 2023 3:23 PM

Shah Rukh Khan Starrer Pathaan Movie Five Days Box Office Collections - Sakshi

తాజాగా పఠాన్‌ మూవీ రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఇండియాలో రూ.335 కోట్లు రాబట్టగా ఓవర్సీస్‌లో రూ.207 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా పఠాన్‌ ఐదు రోజుల్లోనే రూ.54

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ఆకలితో ఉన్న పులి పంజా విసిరినట్లుగా నాలుగేళ్లు వెండితెరకు దూరంగా ఉన్న ఆయన బాక్సాఫీస్‌ మీద యుద్ధమే చేస్తున్నాడు. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ బాయ్‌కాట్‌ గ్యాంగ్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. తాజాగా పఠాన్‌ మూవీ రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఇండియాలో రూ.335 కోట్లు రాబట్టగా ఓవర్సీస్‌లో రూ.207 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా పఠాన్‌ ఐదు రోజుల్లోనే రూ.542 కోట్లు వసూలు చేయడంతో షారుక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. చూస్తుంటే పఠాన్‌ త్వరలోనే రూ.700 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా ఈ సినిమాలో షారుక్‌ సరసన హీరోయిన్‌ దీపికా పదుకొణె నటించింది. సిద్దార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను ఎవరూ చూడొద్దంటూ సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌ గ్యాంగ్‌ తెగ హల్‌చల్‌ చేసింది. కానీ షారుక్‌ స్టార్‌డమ్‌ ముందు బాయ్‌కాట్‌ నినాదం పని చేయలేదు. పైగా ఆయన సినిమా రిలీజై దాదాపు నాలుగేళ్లవుతుండటంతో పఠాన్‌ను చూసేందుకు ఎగబడుతున్నారు జనం.

చదవండి: అసభ్యంగా తాకబోయాడు.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటుడు
పెళ్లైన 10 ఏళ్లకు సీమంతం.. భావోద్వేగంలో నటి

Advertisement
 
Advertisement
Advertisement