‘రెబల్‌’గా వస్తోన్న జీవీ ప్రకాష్‌ | Sakshi
Sakshi News home page

GV Prakash: ‘రెబల్‌’గా వస్తోన్న జీవీ ప్రకాష్‌

Published Wed, Oct 4 2023 12:26 PM

GV Prakash Kumar Rebel Movie Shooting Completed - Sakshi

సంగీత దర్శకుడిగా, కథానాయకుడిగా యమా బిజీగా ఉన్నాడు నటుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌. ప్రస్తుతం ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న కెప్టెన్‌ మిల్లర్‌, విక్రమ్‌ హీరోగా నటిస్తున్న తంగలాన్‌, టాలీవుడ్‌ నటుడు రవితేజ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా తాజాగా కథానాయకుడిగా కనిపించిన అడియే చిత్రం ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ పొందింది.

తాజాగా జీవీ ప్రకాష్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రెబెల్‌. కేజీ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నికేష్‌ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. శరవేగంగా షూటింగ్‌ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ జీవీ ప్రకాష్‌ కుమార్‌ మంగళవారం తన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అందులో తమిళ సినీ పరిశ్రమలో ఇది గేమ్‌ చేంజ్‌ కథా చిత్రంగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నవ దర్శకుడు ఎంతో నమ్మకంగా రెబల్‌ చిత్రాన్ని తెరకెక్కించారని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం పేరు వింటేనే ఇది యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని పిస్తోంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ కమర్షియల్‌ ఎంటర్‌ టెయినర్‌ కథాచిత్రాల్లో నటించి చాలా కాలమే అయ్యింది. దీంతో ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement
 
Advertisement