మిలన్‌కు బై బై  | Sakshi
Sakshi News home page

మిలన్‌కు బై బై 

Published Sat, Oct 14 2023 12:50 AM

Gopichand and Sreenu Vaitlas film wraps up Milan schedule - Sakshi

మిలన్‌కు బై బై చెప్పారు గోపీచంద్‌. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ఇటలీలో మొదలైన విషయం గుర్తుండే ఉంటుంది.

అక్కడి మిలన్‌ నగరంలో ప్లాన్‌ చేసిన షెడ్యూల్‌ ముగిసింది. గోపీచంద్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఓ పాటతో ఈ విదేశీ షెడ్యూల్‌ పూర్తయినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌. 

Advertisement
 
Advertisement