
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు. నాలుగు అంతస్థుల వరకు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం అదనంగా పెంట్‌హౌస్ నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన ఆ పెంట్‌హౌస్‌ను ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ జీహెచ్‌ఎంసీ సర్కిల్-18 అధికారులు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.
అల్లు బిజినెస్ పార్క్ నవంబర్ 2023లో నటుడు అల్లు అర్జున్ కుటుంబం పనులు మొదలుపెట్టింది. అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ నిర్మాణం ప్రారంభించబడింది. ఈ పార్క్ జూబ్లీహిల్స్‌లో ఉంది. ఇది గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపారాల కార్యకలాపాలకు కేంద్రంగా ఈ భవనం పనిచేస్తుంది. అయితే, అనుమతులు లేకుండా పెంట్‌హౌస్ నిర్మించడంతో దానిని కూల్చేస్తామంటూ జీహెచ్‌ఎంసీ నోటీసులు ఇచ్చింది.