
నేడు (అక్టోబరు 23) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో డార్లింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం సొంతం చేసుకున్న డార్లింగ్ కోసం అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసింది. సుమారు 7నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో అదిరిపోయే రేంజ్‌లో ఉంది. డార్లింగ్ ఫ్యాన్స్‌కు నచ్చేలా వీడియో ఉండటంతో నెట్టింట వైరల్ అవుతుంది.
గతంలో ప్రభాస్ గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ‘అర్జునుడి లాంటి రూపం.. శివుడి లాంటి బలం.. రాముడి లాంటి గుణం..’ డైలాగ్స్‌తో వీడియోతో ప్రారంభమౌతుంది. ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని పాపులర్ సీన్స్‌తో ఈ వీడియోను ఎడిట్ చేశారు. కేవలం ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు అందరినీ మెప్పించేలా ఉన్న స్పెషల్ మ్యాష్‌అప్ వీడియోను చూసేయండి.